నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయా స్టేషన్లకు వెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు.
వీఆర్‌లో ఉన్న పి.సాయన్న (ఎస్‌ఐ)ను నిజామాబాద్ టౌన్-4 పోలీస్ స్టేషన్‌కు కేటాయించారు. వీఆర్‌లో ఉన్న ఎం.కళ్యాణి (డబ్ల్యూఎస్‌ఐ)ని నిజామాబాద్ టౌన్-1 పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉంటూ నందిపేట పోలీస్ స్టేషన్‌కు అటాచ్డ్‌గా ఉన్న ఎల్.రామ్ (ఎస్‌ఐ)ను బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బదిలీ అయిన ఎస్‌ఐలు వెంటనే తమ కొత్త విధుల్లో చేరాలని, సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులు వారు రిపోర్టు చేసిన విషయాన్ని కమిషనరేట్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
