HomeCRIMEడబుల్ పేరుతొ లూటీ చేస్తున్న ముఠా .....పట్టుకున్న అల్వాల్ పోలీసులు ........ముఠా లో జిహెచ్ యంసి...

డబుల్ పేరుతొ లూటీ చేస్తున్న ముఠా …..పట్టుకున్న అల్వాల్ పోలీసులు ……..ముఠా లో జిహెచ్ యంసి ఉద్యోగి

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పిస్తామంటూ అమాయకులను లూటీ చేసిన ముఠాఎట్టకేలకు పోలీసులకు చిక్కింది ఆల్వాల్ పోలీసులు ఈ ముఠా రట్టు చేశారు. ఏడుగురు నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

నిందితుల్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి తిమ్మరి పుష్పలత ఏ2 గా ఉన్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు విశాల్ ఏ3, జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్ సింగ్ ఏ6 లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

వారి వద్ద నుంచి 79 నకిలీ డబుల్ బెడ్ రూమ్ పత్రాలతో పాటు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ స్కామ్‍లో ప్రధాన నిందితుడు జైరాజ్ ఇటీవల మరణించిట్లు పోసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

గతంలో జీహెచ్‌ఎంసీ లో పనిచేసి, ప్రస్తుతం కలెక్టరేట్ ఆఫీస్‌లోని అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న తిమ్మరి పుష్పలత, ఆమె కుమారుడు విశాల్ ఈ మోసంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితులకు నమ్మకం కలిగించడం కోసం వీరు ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ అలాట్‌మెంట్ ప్రొసీడింగ్ కాపీలను సృష్టించి ఇచ్చారని ఇందుకోసం వాడిన నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసిన వారిని, ఫేక్ కాపీలను జిరాక్స్ తీసి ఇచ్చిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా 100 మంది నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు అలాగే పరారీ లో ఉన్న నిందితుల కోసం స్పెషల్ ఇంకా గాలిస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments