పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు.
ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారి కోసం, మార్కులు పెంచుకోవాలనుకున్న వారి కోసం నిర్వహించిన ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ రికార్డు సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, సబ్జెక్టుల వారీగాఅందుబాటులో వుంచారు
