నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి నగదుతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నగరంలోని రైతుబజార్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి నగదు రూ.4,800లతో పాటు ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు పేర్కొన్నారు.
