నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో కొందరు ముదురు కానిస్టేబుళ్ల ఆగడాలు చూస్తుంటే ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక ప్రైవేటు వసూళ్ల కేంద్రమా అన్న అనుమానం కలుగుతోంది. ఉన్నతాధికారుల బలహీనతలే ఆసరాగా, సిండికేట్‌గా ఏర్పడిన ఈ కానిస్టేబుళ్లు.. ఇప్పుడు అధికారులను సైతం శాసించే స్థాయికి ఎదిగారు.
సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి అక్రమ వసూళ్లతో కోట్లకు పడగలెత్తిన ఈ ముఠా తీరు విస్మయానికి గురిచేస్తోంది.ఒక కానిస్టేబుల్ నెల రోజుల పాటు సింగపూర్‌లో గడిపినా, రికార్డుల్లో మాత్రం విధుల్లో ఉన్నట్లుగా చూపించుకోవడం వెనుక ఉన్న అండదండలు ఎవరివోనని శాఖలో చర్చ నడుస్తోంది.
అధికార దర్పంతో ఈ కానిస్టేబుళ్లు సాగిస్తున్న వసూళ్ల పర్వం అంతుచిక్కడం లేదు. అధికారుల మాట ఎలా ఉన్నా కింది స్థాయిలో కానిస్టేబుళ్లు సాగిస్తున్నావ సూళ్ల దందాపై అబ్కారీశాఖ ఎట్టకేలకు దృష్టిసారించింది.
ఈ ముఠా ఆ గడాలను అడ్డుకట్టవేసే దిశగా కార్యాచరణ మొదలైంది. అధికారులను సైతం తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని వారినే దబాయించే పరిస్థితి నెలకొoది. తమ మాటను లెక్క చేయని వారు ఏస్థాయి అధికారినైనా ముప్పు తిప్పలు పెడతారు. చివరకు వారి ఆస్తుల చిట్టాను ఏసిబికి ఇస్తారు.
తమ అరా చకాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించడం, త ప్పుడు డిప్యూటేషన్లతో వేధించడం పరిపాటిగా మారింది. ఈ ‘ఎక్సైజ్ దందాల’పై ఉన్నతాధికారుల మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. శాఖలోని ఓ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది.
నెల రోజుల పాటు ఆయన సింగపూర్లో విహారం చేస్తున్నట్లు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కమిషనర్ ముందస్తు అను మతి తప్పనిసరి. అయితే, ఈ పర్యటనకు సంబంధించి నిబంధనలు పాటించారా? లేదా? అనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఆ సమయంలో ఆయన సర్వీస్ రిజిస్టర్ లో ఎర్నెడ్ లీవ్స్ గా నమోదు చేయడం గమనార్హం.
అలాగే దాదాపు నెలరోజుల పాటు వి ధులకు హాజరుకాకుండానే సెలవులో ఉన్నట్లు రికార్డుల్లో చూపడం వెనుక ఉన్న అంతర్యమేమిటో అధికారులే చెప్పాలి. తన హోదాను పక్క నబెట్టి, అధికారిగా చలామణి అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నట్లు ఆరోపణలున్నాయి.
తనను ఎదిరించిన వారిని, సహచర కానిస్ట్రీ బుళ్లను అన్యాయంగా కేసుల్లో ఇరికించడం, డిప్యూటేషన్ల పేరుతో వే ధించడం పరిపాటిగా మార్చుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. త నపై వచ్చే ఫిర్యాదులను తప్పుదోవ పట్టించడానికి, మీడియా సంస్థలను వాడుకుంటూ ప్రత్యర్థులను బెదిరిస్తున్నట్లు సమాచారం.
వీరి ఆస్తుల చిట్టా చూస్తే సామాన్యులకు క ళ్లు బైర్లు కమ్మడం ఖాయం. సదరు వ్యక్తి కానిస్టేబుల్కు బహుళ అంతస్తుల భవనం (నిర్మాణంలో), అపార్ట్మెంట్లో ఫ్లా ట్లు, భవనం, విలాసవంతమై న కార్లు, విదేశాల్లో విద్యన భ్యసిస్తున్న పిల్లలు, వం దల ఎకరాల భూమి.. ఇలా అ క్రమ సంపాదన అంతులేకుండా పోతోంది.
కేవలం అతను ఒక్కడే కాదు, మరో కానిస్టేబుల్ యూనియన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ కొన్ని ఎకరాలు, నిజామా బాద్లో విలాసవంతమైన భవనాలు కలిగి ఉన్న ట్లు స మాచారం. మరో కానిస్టేబుల్ కు నిజామాబాద్ నగరం లో ఫ్లాట్, అబ్దుల్లాపూర్ విలువైన భూమి ఉన్నట్లు స మాచారం.
మరో కానిస్టేబుల్ కు బాన్సువాడలో 10. ప్లాట్లు, నిజామాబాద్ నగరానికి సమీపంలోనే రాజమ హల్ తరహా భవనం ఉండటం చర్చనీయాంశమైంది. వీ రందరి ఆస్తులు లెక్కతీస్తే నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కా నిస్టేబుళ్లదే పైచేయి అని చెప్పకతప్పదు.
రాజకీయ ఒత్తిళ్లతో అధికారులను మభ్య పెడుతూ, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న ఈ ఎక్సైజ్ బా బుల పైఉన్నతాధికారులుదృష్టి సారించాలని, బాధితులు కోరుతున్నారు. ఈ కానిస్టేబుళ్లు కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా, బెల్ట్ షాపుల నుంచి మామూళ్లు దండుకుంటూ, తమపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే యూనియన్ల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు.
అధికారుల బది లీల సమయంలో కూడా వీరు అదృశ్యంగా ఉంటూ, రాజకీయ పలుకు బడితో దర్జాగా తిరుగుతున్నారు. గతంలోనే వీరిపై ఏసీబీ కన్నేసింది.
ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియలో వీరు తప్పించుకున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న ఈ పెద్ద తి మింగలాలపై ఏసీబీ నిఘా పెట్టినట్లు ఎక్సైజ్ శాఖలో చర్చ నడుస్తోంది.
