నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన విభాగాలకు సంబంధించి ఇద్దరు ఏసీపీలు మంగళవారం ఒకే రోజు బాధ్యతలను స్వీకరించారు. సోమవారం ప్రభుత్వం జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల మేరకు, మంగళవారం ఉదయం నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా శ్రీశైలం, సీసీఆర్బీ ఏసీపీగా గురునాయుడు తమ కార్యాలయాల్లో బాధ్యతలను చేపట్టారు. సీసీఎస్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన శ్రీశైలంకు నిజామాబాద్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది.
గతంలో ఇక్కడ ఎస్ఐగా, ఎస్బీ సీఐగా విధులు నిర్వర్తించిన ఆయన, ఎస్బీలో సీఐగా ఉన్న సమయంలోనే పదోన్నతి పొంది ఏసీపీగా బాధ్యతలు చేపట్టడం విశేషం. స్థానిక పరిస్థితులపై మంచి పట్టు ఉండటంతో, నేర దర్యాప్తు విభాగంలో ఆయన తనదైన ముద్ర వేయనున్నారని భావిస్తున్నారు.
అదేవిధంగా, సీఆర్బీ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన గురునాయుడు కూడా తమ కార్యాలయంలో విధులను ప్రారంభించారు. ఏసీలుగా బాధ్యతలు స్వీకరించిన వెంబటే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చైతన్య ను ఆయన కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇరువురు ఏసీపీలకు పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. .
