నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకా నగర్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది.
గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి, హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 4 నుండి 5 వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ సునీల్, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. అలాగే, ఆలయం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
