HomeCRIMEరేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ

నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకా నగర్‌లో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది.

గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి, హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 4 నుండి 5 వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ సునీల్, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. అలాగే, ఆలయం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments