యుద్ధ పరిస్థితులు తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ రేట్లను తగ్గించింది . హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 188.50 మేర తగ్గింపును ప్రకటించాయి.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,930 కి చేరింది
