నిజామాబాద్ జిల్లాలో స్నేహపూర్వక రాజకీయం చేయాలని ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు కొనసాగించాలని ఉద్దేశంతో రాజకీయం చేయడం జరిగింది కానీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇరవత్రి అనిల్ వ్యక్తిగత దూషణలు తనకు ఆగ్రహం కల్పించాయని దమ్ముంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామని ఎవరు గెలుస్తారో చూసుకొని ఓడిన వారు శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా మీడియా సమావేశంలో సవాల్ విసిరారు.
జిల్లాలో అభివృద్ధి శూన్యమని కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని ఎమ్మెల్సీ పదవి కానీ పిసిసి అధ్యక్షుడు గాని ఎలా వచ్చిందో లాభయింగ్ ఎలా చేశావు ప్రజలందరికీ తెలుసని ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవని మహేష్ కుమార్ గౌడ్ తన గురించి మాట్లాడడం హాస్యాస్పదమని , సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి జిల్లా అన్యాయం చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కి అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు మాత్రమే నిధులు ఇస్తుందని ఎక్కడ కూడా మిగతా జిల్లాలకు నిధులు ఇచ్చిన పాపాన పోలేదు నెలకు ఒకసారి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తూ రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పదవులు కాపాడుకుంటున్నారని ఇప్పటివరకు 210 లేఖలు రాసిన నిధులు మాత్రం మంజూరు
చేయకుండా కాలయాపన చేస్తున్నారని దమ్ముంటే జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చి రాజకీయ చతురత చూపాలి , ఇరవత్రి అనిల్ భూమికి మూడు అడుగులు మాత్రమే ఉన్నాడని తనను నరుకుతా అని వ్యక్తిగత దూషణలు చేసిన అనిల్ కి చివరిసారి హెచ్చరిస్తున్న తనపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కొట్లాడాలని ఆర్మీలో పోటీ చేయాలనుకుంటే పోటిలో నిలిచి పోరాడాలి మాత్రం ఇలా దిగజారు రాజకీయం చేయడం
రాజకీయ విలువలను వ్యక్తుల స్థాయిని తగ్గిస్తుందని ప్రత్యక్ష చర్చకు ఎప్పుడైనా సిద్ధమని దమ్ముంటే రావాలని లేదా దమ్ముంటే రాజీనామా చేసి పోటీలో నిలుస్తానని సెమీఫైనల్ ఎన్నికగా రాబోయే రాబోయే బిజెపి ప్రభుత్వానికి సూచిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్ఛ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఫ్లోర్లీడర్ ప్రమోద్, నాగుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
