రాష్ట్రం లో మావోయిస్టు నక్సల్స్ నుంచి ఎలాంటి ముప్పు లేదనే నెపంతో ప్రముఖుల భద్రత ను అనూహ్యంగా తగ్గిస్తున్న ప్రభుత్వం మొదట రాజకీయ ప్రముఖల గన్ మెన్ లను తొలగించింది.ఇప్పుడు మాజీ డీజీపీల సెక్యూరిటీ ని రివ్యూ చేసింది గన్ మెన్ లను కుదించడంతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ కారులను వెనక్కి తెప్పిస్తుంది.
రిటైర్మెంట్ అయిన డీజీపీలతో పాటు రిటైర్ అయ్యాక పదవులలో కొనసాగిస్తున్న వారి విషయంలోనూ ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా ప్రస్తుతం కొనసాగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
దాదాపు 26 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులకు బుల్లెట్ వాహనాలుకలిగి ఉన్నారని సమాచారం వీరితో పాటు సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు సైతం బుల్లెట్ ఫ్రూఫ్ కార్లను వాపస్ తీసుకునే ఛాన్స్ ఉంది.
అలాగే పదవి విరమణ చేసి ఇంకా అదే హంగామా తో సాగుతున్న డీజీ స్థాయి అధికారుల కు ఎస్కార్ట్ వాహనాలను సైతం తొలగించనున్నారు ..పలువురు రాజకీయ నేతలతో పాటే పోలీసు అధికారులకు ఉన్న గన్ మెన్ ల సంఖ్య ను కుదించబోతున్నారు. చాలావరకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ లకే పరిమితం చేయబోతున్నారు
