HomeCRIMEకాంగ్రెస్ చేస్తున్న దాష్టీకానికి మూల్యం తప్పదు...తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్ చేస్తున్న దాష్టీకానికి మూల్యం తప్పదు…తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత


ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఉద్యమకారులతో పెట్టుకుని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బాగుపడదని తేల్చిచెప్పారు.

బోడుప్పల్ లో భూ పోరాటం చేసి అరెస్ట్ అయిన కవిత గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాష్టీకానికి ఆ పార్టీ కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు.. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూపోరాటం ఉద్రిక్తత

అంతకు ముందు తెలంగాణ రక్షణ సేన పార్టీ బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది . ఆమెను అరెస్ట్ చేసే సమయంలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.. కవిత ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు.

దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకొని కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వేలాది మంది బోడుప్పల్ చేరుకున్నారు.

భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్టించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు.

పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

కవిత ను అరెస్ట్ చేసి బొల్లారం స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటల పాటు ఆమెను స్టేషన్ లో నిర్భందించారు. కవిత ను విడుదల చేయాలని బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు.

ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తే ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో కవితను నిర్బంధించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments