కేసు ఓ చీటింగ్ కేసులో రిటైర్ డిజిపి ఏకే ఖాన్ తనయుడు కేసు నమోదైంది. సినిమా లో పెట్టుబడుల పేరిట రూ.50లక్షలు మోసం చేశాడని సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి ప్రస్తుతం మహారాగ్ని అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను ఫైనాన్షియర్ల కోసం వెతుకుతున్న సమయంలో ఏకే ఖాన్ తనయుడు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అల్లుడు మోసిన్ ఖాన్, అతని దోస్తు తబ్రేజ్ లు కల్సి నిధులు సమకూరుస్తామని నమ్మించారు.
అందుకు ప్రతిఫలంగా తమకు కమిషన్ రూపంలో ముందుగానే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వారిని నమ్మి.. అడిగినంత డబ్బును ముందుగానే ఇచ్చేశానని బాడీతఁడు తన పిర్యాదు లో పేర్కొన్నారు కానీ డబ్బులు తీసుకున్నాక మోసిన్ ఖాన్, తబ్రేజ్‌ల నుంచి ఎటువంటి స్పందన లేదు.
దీంతో జూబ్లీహిల్స్ సన్‌లైట్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని అనీశ్ పట్టుబట్టాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా బౌన్సర్లతో దాడి చేయించి గెంటేశారని . ఈ క్రమంలో అనీశ్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అనీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
