అసలే అది కల్తీ . కల్లు అందులో మద్యం కలిపి సేవించడం తో కిక్కు రివర్స్ అయింది ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
ఈ దారుణ ఘటన ఏడపల్లి మండలం అంభం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంభం గ్రామానికి చెందిన విఠల్, లక్ష్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు బోధన్ మెయిన్ రోడ్డులోని నర్సాపూర్ సమీపంలో ఉన్న ఒక అక్రమ కల్లు దుకాణానికి వెళ్లారు.
అక్కడ కల్లు తాగే క్రమంలో, మరింత ఎక్కువ ‘కిక్కు’ రావాలనే ఉద్దేశంతో వారు కల్లులో మద్యం (లిక్కర్) కలిపి సేవించినట్లు సమాచారం.అక్కడికక్కడే ప్రాణం విడిచిన విఠల్మద్యం కలిపిన కల్లు తాగిన కొద్దిసేపటికే వారిద్దరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వారు తీవ్ర అస్వస్థతకు గురికావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో విఠల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.మరో బాధితుడు లక్ష్మయ్య పరిస్థితి కూడా అత్యంత విషమంగా మారడంతో, అతడిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సదరు అక్రమ కల్లు దుకాణం నిర్వాహకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.రంగంలోకి దిగిన పోలీసులు.. ఎక్సైజ్ అధికారుల మౌనం!ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వారు కేవలం మద్యం కలిపిన కల్లు తాగడం వల్లే చనిపోయారా?లేదా ఆ కల్లులో మరేదైనా విషపూరిత రసాయనాలు (కల్తీ కల్లు) కలిశాయా?అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
