HomeHEALTHపోలీసుల భద్రతకు 'మేఘన డెంటల్' చేయూత

పోలీసుల భద్రతకు ‘మేఘన డెంటల్’ చేయూత

మన ఊరు – మన భద్రత కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మేఘన డెంటల్ కాలేజీ వారు శుక్రవారం హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారికి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా మేఘన డెంటల్ కళాశాల యాజమాన్యం ఉదారతను చాటుకుంది. సామాజిక బాధ్యతగా పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని కోరుతూ, 10 అత్యాధునిక హెల్మెట్లను స్టేషన్ సిబ్బందికి అందజేసింది.

ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, మేఘన డెంటల్ కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో పోలీసులే ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తమ భద్రత కోసం ముందుకొచ్చి సహకారం అందించిన మేఘన డెంటల్ కళాశాల యాజమాన్యానికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments