నిజామాబాద్ నగరంలోని వెంకటేశ్వర లాడ్జిలో మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
నగరంలోని వెంకటేశ్వర లాడ్జిలో ఒక మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పరిశీలించగా, సదరు మహిళ అప్పటికే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.మృతురాలు నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దేవత రాధ (40)గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
