HomePOLITICAL NEWSArmoorఅనుచిత వ్యాఖ్యలు చేస్తే రాకేష్ రెడ్డిని ఉరికిస్తాం .......సీఎం పీసీసీ చీఫ్ ల మీద...

అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాకేష్ రెడ్డిని ఉరికిస్తాం …….సీఎం పీసీసీ చీఫ్ ల మీద మాట్లాడే స్థాయి కాదు …..

కాంగ్రెస్ నేతలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సవాల్ చెయ్యడం హాస్యా స్పదంగా వుందని డీసీసీ అధ్యక్షడు నగేష్ రెడ్డి అన్నారు రాకేష్ రెడ్డి కి దమ్ముంటే రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లొ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని రాకేష్ రెడ్డి కేవలం 5 వార్డు లు గెలిచి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలనడం విడ్డురమన్నారు

మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అన్ని మున్సిపల్ సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది.ఈ జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీ ,అగ్రికల్చర్ కాలేజీ లు వచ్చాయన్నారు జిల్లా అభివృద్ధిపై చర్చ కు రాకేష్ రెడ్డి సిద్ధంగా ఉండాలని సవాల్ చేస్తున్నామన్నారు

పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తాతల కాలం నుండి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయని వారు ఎంతో మందికి దానధర్మాలు చేస్తున్నారని ఇటీవల భీంగల్ లో స్కూల్ నిర్మాణానికి 11 ఎకరాల భూమిని ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్ .ను విమర్శించే స్థాయి మీకు లేదు.మరొకసారి కాంగ్రెస్ నాయకులపై అణిచిత వాక్యాలు చేస్తే మిమ్మల్ని రోడ్లపైకి ఊరికించి కొడతామని నగేష్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments