HomeTelanganaHyderabadయంఐయం లో అలజడి .....పార్టీవర్గాల్లో కలకలం రేపిన ఎమ్మెల్సీ సస్పెండ్ ............తీవ్ర ఆరోపణల నేపథ్యంలో దారుస్సలాం...

యంఐయం లో అలజడి …..పార్టీవర్గాల్లో కలకలం రేపిన ఎమ్మెల్సీ సస్పెండ్ …………తీవ్ర ఆరోపణల నేపథ్యంలో దారుస్సలాం కఠిన చర్యలు

సోషియల్ మీడియా లో వైరల్ అవుతున్న ఓ వీడియో మజ్లీస్ పార్టీ ని కుదిపేస్తోంది. ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ని పార్టీ నుంచి ఎంఐఎం అధిష్టానం బహిష్కరించింది.

ఈ వ్యవహారం పార్టీవర్గాలలో కలకలం సృష్టించింది ఆయన సస్పెండ్ చేయడమే కాదు ఎమ్మెల్సీ పదవికి సైతం వెంటనే శాసనమండలి చైర్మన్‍కు తన రాజీనామాను సమర్పించాలని ఆదేశించింది.

ఈ మేరకు గత అర్ధరాత్రి 12 గంటలకు ఏఐఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు. రహ్మత్ బేగ్‌పై ఇంత కఠిన చర్య ఎందుకు తీసుకున్నారన్నదానిపై మాత్రం పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు.

2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్‌ బేగ్‌ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ.ఆయన ను అనూహ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి పదవి కి సైతం రాజీనామా చేయాలని ఆదేశించారు కానీ ఆయన విషయంలో ఎలాంటి ఆరోపణలు వచ్చాయనేది దారుస్సలాం మాత్రం స్పష్టత ఇవ్వలేదు కానీ సోషియల్ మీడియా వేదికగా తీవ్రమైన ఆరోపణలే ప్రచారంలోకి వచ్చాయి

మరో వైపు బిఆర్ యస్ మైనార్టీ నేతలు ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం పార్టీ నాయకత్వాన్ని ఏకి పారేస్తున్నారు ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేసారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మైనర్ బాలిక విషయంలో మీర్జా రహ్మత్ బేగ్ అనుచితంగా వ్యవహరించారంటూ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తాపూర్‌లో కొందరు యువకులు ఆయనతో గొడవకు దిగారని ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments