తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను పొడిగించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన సమగ్ర పరిశీలన అవసరమని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని పేర్కొన్నారు. గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని కోరారు.
