మహారాష్ట్ర నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని రేంజర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ధర్మాబాద్‌కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిసింది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎవరికి విక్రయించేందుకు తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
