ఆదివారం జరుగనున్న నీట్ పిజి పరీక్షా ఒత్తిడి ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మ హత్య కు పాల్పడింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది.
నీట్ పీజీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న ఆమె ఆదివారం పరీక్షా వుండగా .. మనస్తాపంతో కర్నూలుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత ప్రాణాలు తీసుకుంది. గత ఆరు నెలలుగా యువతి హైదరాబాద్‌లో ఉంటూ ‘నీట్ పీజీ’ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది.
