గడువులోగా ఫ్లాట్లు నిర్మించి అప్పగించకుండా కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ తీరుపై రెరా ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది .
బాచుపల్లిలోని ‘వాసవి ఎస్ అర్బన్’, హాఫీజ్‌పేట్‌లోని ‘వాసవి లేక్ సిటీ వెస్ట్’ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసి వారికి నిర్ణిత గడువులోగా ప్లాట్ లు ఇవ్వలేక పోయింది.
దీనితో బాధితులు దాఖలు చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన రెరా కీలక తీర్పు వెలువరించింది. కస్టమర్ల నుంచి భారీగా నిధులు వసూలు చేసి ఏళ్ల తరబడి తిప్పుకుంటున్న బిల్డర్ల వైఖరిపై మండిపడింది. బాధితులు చెల్లించిన మొత్తంపై ఏడాదికి 10.70 శాతం వడ్డీని చెల్లించాలని స్పష్టం చేసింది.
