HomeCRIMEభర్తను హత్య చేసిన భార్య కుమారుడు?

భర్తను హత్య చేసిన భార్య కుమారుడు?

జిల్లాలోని మోపాల్ మండలం, పొక్కిర నాయక్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, కొడుకు, కోడలు కలిసి హరి (50) అనే వ్యక్తిని హతమార్చినట్లు సమాచారం.తండాకు చెందిన హరి కుటుంబంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంట్లో భార్య, కుమారుడు, కోడలు హరితో గొడవకు దిగారు. వాగ్వాదం పెరగడంతో ఆవేశంలో వారు హరిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments