ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో వరద నీరు క్రమంగా వస్తుంది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నప్పటికీ ఎగువ గోదావరి లో ని మహా రాష్ట్ర లో భారీ వర్షాలు లేక పోవడంతో నా మాత్రంగా నీరు వస్తుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు 80.501 టీఎంసీల ఉండగా మంగళవారం సాయంత్రం వరకు 1064.50 అడుగులు 15.400 టీఎంసీల కు చేరింది .
ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ కాకతీయ కాలువ కి 300 క్యూసెక్కులు,మంచి నీటి అవసరాలకు 231 క్యూసెక్కులు ,ఆవిరి రూపంలో 286 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొత్తo కలిపి 817 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి ఔట్ ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1067.10 అడుగులు 18.833 టీఎంసీలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 1.805 టీఎంసీల నీరు వచ్చి చేరిందని. ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 2.749టీఎంసీల నీరు విడుదల చేశామని అధికారులు అన్నారు.
