జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్ రాజ్ చాగల్లులో ఓ వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించి అడ్డంగా దొరికిపోయాడు.
సోమవారం రాత్రి వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన అతడు అఘాయిత్యానికి యత్నించగా.. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పరుగున అక్కడకు వచ్చారు. దీంతో భయపడ్డ నిందితుడు బాత్రూమ్‌లోకి పారిపోయి తలదాచుకున్నాడు.
విషయం గుర్తించిన స్థానికులు.. బాత్రూంకు బయట నుంచి తాళం వేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
