HomeCRIMEప్రియుడు తో కల్సి భర్త ను హత్య చేసిన భార్య ........ఇంట్లో నే చంపేసి మహారాష్ట్ర...

ప్రియుడు తో కల్సి భర్త ను హత్య చేసిన భార్య ……..ఇంట్లో నే చంపేసి మహారాష్ట్ర సరిహద్డు లో కాల్చేసింది …….మిగిలిన మృతదేహం ను పూడ్చేసింది ……..మియాపూర్ వెలుగులో

ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అనంతరం మహారాష్ట్ర సరిహద్దు లో పూడ్చిపెట్టింది. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని మియాపూర్ లో వెలుగు చూసింది.హత్య తొమ్మిది నెలల తరవాత వెలుగు లోకి వచ్చింది .

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది నవంబర్‌లో మియాపూర్ కు చెందిన సత్యవతి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు భార్య మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డింగ్ లను సైతం తీయించారు.అయితే అందులో ఓ నంబర్ నుండి పదే పదే సత్యవతికి ఫోన్ రావడం, ఎక్కువసేపు మాట్లాడటం గమనించారు. ఆ నంబర్ ఆధారంగా ఫోన్ మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య భర్తను హత్య చేసినట్టు నిర్దారించారు. అంతేకాకుండా కేసు నుండి బయటపడేందుకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది.

నవంబర్ లో హత్యకు ముందు భర్తకు అన్నంలో నిద్రమాత్రలు కలిపింది.అతడు నిద్రలోకి జారుకున్న తరవాత దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.

తరవాత ప్రియుడితో కలిసి కారులో మహరాష్ట్ర సరిహద్దులో అటవీ ప్రాంతంలో తీసుకువెళ్లి మరో స్నేహితుడితో కలిసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. అనంతరం మిగిలిన శరీరాన్ని పూడ్చిపెట్టారు. తొమ్మిది నెలల తరవాత అసలు విషయం బయటపడటకు పొక్కింది మియాపూర్ పోలీసులు మహారాష్ట్ర పోలీసు ల సహకార తో మృతదేహం ను వెలికి తీశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments