చంచల్‌గూడ ముద్రణాలయం నుంచి ఐఎస్ సదన్ మీదుగా సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ప్రముఖ సంఘసేవకురాలు, దివంగత సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సైదాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినయ్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ..నిరుపేద విద్యార్థుల అభ్యున్నతి కోసం అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరుతో ఇందిరా సేవా సదన్ విద్యాసంస్థలను సంగం లక్ష్మీబాయి దశాబ్దాల క్రితమే స్థాపించారని గుర్తు చేశారు.
ఆ విద్యాసంస్థల్లో చదువుకుని, ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన వేలాది మంది సమాజానికి విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
సంఘసంస్కర్తగా, రాజకీయ నాయకురాలిగా, విద్యావేత్తగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని, సైదాబాద్ ప్రాంతానికి ఆమె గర్వకారణమని కొనియాడారు.
ఆమె సేవలను గుర్తించి, నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరును నామకరణం చేయాలని కోరారు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తమ పోరాటానికి మద్దతుగా ముఖ్యమంత్రి, సంబంధిత ఉన్నతాధికారులను కూడా కలవనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వాభిమాన్ పరిషత్ ప్రతినిధులు రాజు యాదవ్, సంతోష్, లక్ష్మీనారాయణ, దయానంద, వేణు, రాకేష్, శ్రీకాంత్, ప్రభాకర్, శ్రీనివాస్, శేఖర్, సురేష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి..* మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేసిన తెలంగాణ స్వాభిమాన్ పరిషత్- డిమాండ్‌ను సమర్థించిన వినయ్ కిషోర్ యాదవ్చంచల్గూడ ముద్రణాలయం నుంచి ఐఎస్ సదన్ మీదుగా సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ప్రముఖ సంఘసేవకురాలు, దివంగత సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సైదాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినయ్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ..నిరుపేద విద్యార్థుల అభ్యున్నతి కోసం అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరుతో ఇందిరా సేవా సదన్ విద్యాసంస్థలను సంగం లక్ష్మీబాయి దశాబ్దాల క్రితమే స్థాపించారని గుర్తు చేశారు.
ఆ విద్యాసంస్థల్లో చదువుకుని, ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన వేలాది మంది సమాజానికి విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.సంఘసంస్కర్తగా, రాజకీయ నాయకురాలిగా, విద్యావేత్తగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని, సైదాబాద్ ప్రాంతానికి ఆమె గర్వకారణమని కొనియాడారు. ఆమె సేవలను గుర్తించి, నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరును నామకరణం చేయాలని కోరారు.
ఈ డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తమ పోరాటానికి మద్దతుగా ముఖ్యమంత్రి, సంబంధిత ఉన్నతాధికారులను కూడా కలవనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వాభిమాన్ పరిషత్ ప్రతినిధులు రాజు యాదవ్, సంతోష్, లక్ష్మీనారాయణ, దయానంద, వేణు, రాకేష్, శ్రీకాంత్, ప్రభాకర్, శ్రీనివాస్, శేఖర్, సురేష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.