నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ శివారులో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నందిపేట్ ఎస్సై కె. వినయ్ వివరాలు వెల్లడించారు.
గురువారం సాయంత్రం డొంకేశ్వర్ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
అక్కడ పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి రూ. 22,960 నగదుతో పాటు తొమ్మిది మొబైల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
