పదో తరగతి విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో ని బీసీ బాలుర వసతి గృహం లో జరిగింది జరిగింది , కామారెడ్డి జిల్లా .
గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాఘవేంద్ర అనే విద్యార్థి హాస్టల్‌లో పుస్తకాలు, ఇతర వస్తువులకు ఉపయోగించే రబ్బర్ బ్యాండ్లను మెడకు బిగించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ సునీత వెంటనే కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉన్నతాధికారులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు
