సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని గచ్చిబౌలిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అఓ బైకు ను ఢీకొట్టడం తో ఒకరు మృతి చెందగా మరొకరు సీరియస్ గా ఉన్నారు . ఇద్దరు మహిళలు గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ నుండి అంజయ్య నగర్ కు యాక్టీవ పై వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.
గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న యాక్టివా స్కూటీని వెనక నుంచి వేగంగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మల్లం భవాని అక్కడికక్కడే మృతి చెందగా సుభాషినికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు
