HomeTelanganaNizamabad45వ డివిజన్‌లో నూతన పైప్‌లైన్ పనులకు భూమిపూజ

45వ డివిజన్‌లో నూతన పైప్‌లైన్ పనులకు భూమిపూజ

45వ డివిజన్ ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అందులో భాగంగానే ‘అమృత్ 2.0’ పథకం కింద నూతన వాటర్ పైప్‌లైన్ పనులను ప్రారంభించినట్లు కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ తెలిపారు.

మంగళవారం డివిజన్‌లో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘అమృత్ 2.0’ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయని, డివిజన్ పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ నూతన పైప్‌లైన్ పనులు కాకతీయ స్కూల్ వద్ద ప్రారంభమై, శ్రీనగర్, అమరేశ్వర్ కాలనీ, ప్రగతి నగర్ మీదుగా ఎల్లమ్మ గుట్ట వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఈ పనుల వల్ల డివిజన్‌లోని పలు ప్రాంతాలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందుతుందని, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని సువర్ణ వేణుగోపాల్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments