HomePOLITICAL NEWSArmoorహామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల గొలుసులు తీసుకెళ్లండి..ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి

హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల గొలుసులు తీసుకెళ్లండి..ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి

కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అందిస్తామని ప్రకటించి అమలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకపోతే మహిళలు కాంగ్రెస్ నాయకుల మెడలో ఉన్న బంగారు గొలుసులను తీసుకుని అమ్మి, ఆ రసీదును తనకు అందించాలని.

ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్‌లో తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.అలాగే యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ నాయకులకు చెందిన షోరూంల నుంచి స్కూటీలు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తగిన సమయంలో గద్దె దింపుతారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments