కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ సోమవారం దేశ రాజధాని ఢిల్లీ లో తలపెట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లక్షలాది గా ఈ ఆందోళన కు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చారు . సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దీంతో పోలీసులపై చెప్పులు, వాటర్ బాటిల్స్ విసిరేశారు ఆందోళనకారులు. ఈ ఘటనలో పలువురు పోలీసులు,ఆందోళన కారులు గాయపడ్డారు.భారీ ఎత్తున పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న విద్యార్థులను, నిరసన కారులను ఆపేందుకుు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
//// పార్లమెంట్ గేట్లకు తాళాలు వేశారు//// .
పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటి రోజే ఢిల్లీ విధుల్లో ఆందోళన కారులు లక్షలాది గా వచ్చి కదం తొక్కడం తో భద్రత బలగాలు ఉక్కిరి బిక్కిరి అయ్యాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆందోళన కారులకు బయపడి ముందుగానే పార్లమెంట్ మెయిన్ గేట్ కు భద్రతా సిబ్బంది తాళాలు వేశారు బారికేడ్స్ పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసన కారులు బారికేడ్స్ ను, గేట్లను తోసేసి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. భాష్ప వాయు గోళాలు తగిలి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
మరో వైపు దూసుకొస్తున్న నిరసన కారులను ఆపేందుకు పార్లమెంట్ భద్ర సిబ్బంది టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో సిద్ధం చేసుకున్నారు పోలీసుల లాఠీ ఛార్జ్ తో సీజేపీ సపోర్టర్స్ భారీ ఎత్తున రైల్ భవన్ ముందు భారీ గ్యాదర్ అయ్యారు. పార్లమెంటుకు నిమిషాల దూరంలో రైల్ భవన్ ఉండటంతో ఏ క్షణంలో పార్లమెంట్ వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని ముందే అప్రమత్తం అయ్యారు. పార్లమెంట్ కు అన్ని వైపుల మార్గాలలో భారీగా బలగాలను మోహరించారు.
//// దిగివచ్చిన కేంద్రం ////
సిజేపీపిలుపు మేరకు యువకులు సోమవారం ఛలో పార్లమెంట్ కు లక్షలాది గా తరలి వచ్చారు. నిఘా వర్గాలు సైతం అంచున వేయలేక పోయాయి. అనూహ్యంగా యువకులు తరలి వచ్చి లాఠీ చార్జి బాష్ప వాయువు లను లెక్క చెయ్యకుండా పార్లమెంట్ వైపు దూసుకొచ్చారు.
ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. మెట్టు దిగింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. సోనమ్ వాంగ్ చుక్ వెంటనే విడుదల చేయాలని, నీట్ ఎగ్జామ్ లీకులకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన లేఖను మంత్రికి అందజేశారు.
సీజేపీ ప్రతినిధులతో భేటీ విషయాన్ని మంత్రి జేపీ నడ్డా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. సీజేపీ ప్రతినిధులతో సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన తెలిపారు.
తమ డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని సీజేపీ ప్రతినిధులు అందజేశారని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని వారు కోరారని తెలిపారు. నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో పరిపాలనా యంత్రాంగానికి సహకరించాలని నేను వారిని కోరారని నడ్డా వెల్లడించారు
