HomeTelanganaNizamabadపూర్తీఅయిన కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ల పదవి కాలం.......నేతలకు దక్కని పొడిగింపు హామీ .........ఉలుకు పలుకు లేని అధిష్టానం...

పూర్తీఅయిన కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ల పదవి కాలం…….నేతలకు దక్కని పొడిగింపు హామీ ………ఉలుకు పలుకు లేని అధిష్టానం …..పీసీసీ చీఫ్ కు కత్తిమీద సామేనా ?

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన మొదట్లో అందలం దక్కిన నేతలు కుర్చీ లు వదిలేసారు. కార్పొరేషన్ ఛైర్మెన్ లుగా రెండేళ్ల పదవి కాలం ఎట్టకేలకు పూర్తీ చేసారు. వారం రోజుల క్రితమే వారంతా మాజీలు అయ్యారు.

వారంతా కీలక నేతలే కావడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని శత ప్రయత్నాలు చేస్తున్నారు. మరోదఫా పదవి కాలం పొడగించాలంటూ అగ్ర నేతలను ప్రాధేయ పడుతున్నారు. కానీ జిల్లా కు చెందిన నేతలెవరికి పొడగింపు హామీ మాత్రం దక్కలేదు.

ఈ నెల 15 లోపే నామినేటెడ్ పదవుల నియామకం కసరత్తులఫై క్లారిటీ వస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ ఇదివరకే స్పష్టత ఇచ్చారు.కానీ పదవి కాలం పూర్తీ అయి రెండు వారాలు పూర్తీ అవుతుంది అయినా అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు.

పీసీసీ వర్గాలు సైతం ఈ వ్యహారంలో ఉలుకు పలుకు లేనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఓ వైపు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని దిగిపోయిన ఛైర్మెన్ లు పట్టుబడుతుంటే తమకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలంటూ ఆశావహులు ఒత్తిడి చేస్తున్నారు ముఖ్యంగా ఎన్నికలకు ముందు బీజేపీ బిఆర్ యస్ ల నుంచి వచ్చిన నేతలు కార్పొరేషన్ ఛైర్మెన్ లకోసం గట్టిగా అడుగుతున్నారు .

నిజానికి పార్టీ లో సీనియర్ నేతలకే ప్రభుత్వం వచ్చిన మొదట్లో కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ లుగా నియామకం అయ్యారు.వారి పదవి కాలం రెండేళ్లు పూర్తీ అయింది .

వీరిలో కొంత మంది కీలక నేతలకు పదవి కాలం పొడిగించే ఛాన్స్‌ వుందని విస్తతంగా ప్రచారం జరుగుతుంది. ఒకరిద్దరికి నేరుగా సీఎం రేవంత్‌ నుంచి స్పష్టమైన హామీ ఉన్నట్లు గా చెప్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా నుంచి అరడజన్‌ మందికి కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవులు దక్కాయి.

అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో నామ మంత్రంగా ఫలితాలు వచ్చినా సరే పదవుల పందేరం లో జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ లకోసం చివరి దాక పట్టుబట్టి అధిష్టానం బుజ్జగింపు లతో వెనక్కి తగ్గిన నేతలకు మొదటి ప్రాధాన్యత గా భావించి కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవులు కట్టబెట్టింది.

ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులుగా ఉన్న మానాల వెూహన్‌ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ ‌ ఛైర్మెన్‌ గా నియామకం అయ్యారు మాజీ డీసీసీ తాహెర్‌ ఉర్దు అకాడమీ ఛైర్మెన్‌ గా నియామకం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఇరవత్రి మినరల్‌ డెవలప్‌ మెంట్‌ ఛైర్మెన్‌ గా నియామకం అయ్యారు.

కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్న అన్వేష్‌ రెడ్డి విత్తనాభివద్ది సంస్థ ఛైర్మెన్‌ గా ఆగ్రో ఇండిస్టీ ఛైర్మెన్‌ గా బాలరాజు లు నియామకం అయ్యారు.ఏకంగా ఐదు కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ లు జిల్లాకు దక్కడం పార్టీ వర్గాలను ఉత్తేజం కలిగించింది.

వీరంతా రేవంత్‌ పీసీసీ చీఫ్‌ గా పనిచేసే టైం లో పార్టీకోసం ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి ఆయన వద్ద మంచి మార్క్‌ లు వేసుకున్నవారే. అందుకే పదవులు దక్కాయి పార్టీలోకి కొత్తగా వచ్చినముఖ్య నేతలను సైతం కాదని వీరందరికి పదవులు కట్టబెట్టారు.

కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ లుగా రెండేళ్ల పదవి కాలం పూర్తీ కాబోతుంది. మరోసారి వీరికి పదవులు దక్కుతాయా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.ఒకరిద్దరికి మినహా ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది.

ముఖ్యంగా రెండేళ్ల పదవి కాలం లో పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు వదిలేసి అవినీతి అక్రమాలకు తెరలేపిన వారికి ఛైర్మెన్‌ లుగా కొనసాగించే ఛాన్స్‌ లేదని సమాచారం.అదీగాక మరోదఫా కొనసాగిస్తే సీనియర్‌ నేతల్లో అసంతప్తి పెరిగే ప్రమాదం వుందని పార్టీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మండవ వెంకటేశ్వర్‌ రావు ,అరికెల నర్సా రెడ్డి, ఆకుల లలిత ,ధర్మపురి సంజరు డి రాజేశ్వర్‌ లాంటి నేతలకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వడానికి పార్టీ అగ్ర నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో వీరికి సర్దుబాటు చేస్తారా లేదంటే ఉన్నవారిని మరోదఫా కొనసాగిస్తారా అనేది అధికార పార్టీ లో హాట్‌ టాపిక గా ఉంది.

పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నామినేటేడ్ పదవుల్లో ఆయన ముద్ర ఏ మేరకు వుంటుందనే పార్టీ వర్గాలకు ఆసక్తిగా మారింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments