జిల్లాలో అక్రమ ఇసుక, మొరం తవ్వకాలు, రవాణాపై చీతా ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బోధన్ రూరల్ మండల పరిధిలో గురువారం మెరుపుదాడులు నిర్వహించిన అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు పాటు పట్టుకుని సీజ్ చేశారు
. అలాగే నవీపెట్ మండల పరిధిలో అక్రమంగా మురం తవ్వి రవాణా చేస్తున్న రెండు టిప్పర్లతో పాటు ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సీజ్ చేసిన వాహనాలను సంబంధిత అధికారుల ఆధీనంలో ఉంచి, నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
