పేపర్ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయని కేసు విచారణ వేగంగా జరగడానికి . ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించానని ప్రధాని మోడీ స్పష్టం చేసారు దీనిపై శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు .
పేపర్ లీకేజ్ ఘటనపై రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం. నిందితులను పట్టుకున్నాం. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చమన్నారు.దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్‌పై ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు.
ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ఒక వీడియో ద్వార దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పేపర్ లీకేజ్ ఘటనపై గత రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించా’ అని చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులను పట్టుకున్నామని, విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను తాము నెరవేర్చామని చెప్పారు.
