పేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మలక్‌పేట నియోజకవర్గంలోని 67 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా పంపిణీ చేశారు. పంజేషాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కార్యక్రమం నిర్వహించారు. మొత్తం రూ.67,07,772 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
సైదాబాద్ మండలంలోని మోసరంబాగ్, సైదాబాద్, కరణ్‌బాగ్, కుర్మగూడ, శంకేశ్వర్ బజార్, ప్రెస్కాలనీ, సపోటాబాగ్ ప్రాంతాలతోపాటు చార్మినార్ మండలంలోని చంచల్‌గూడ, ఆజంపురా, ఉస్మాన్‌పురా, ఫర్హత్‌నగర్, బాగ్-ఏ-జహానారా ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు.
కార్యక్రమంలో చార్మినార్ మండల డీటీ, ఎంఆర్ఓ సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సైదాబాద్ మండల ఆర్ఐ మహ్మద్ యూనస్, చార్మినార్ మండల ఆర్ఐ డి.శేఖర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
