పుట్టింటి వారు తరిమేస్తే అత్తింటి వారు ఆదరించారని నిజామాబాద్ సభ లో భావోద్వాగానికి గురైన కవిత రక్షణ సేన ను సొంత జిల్లాలో బలోపేతం చెయ్యడానికి బలమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన రాజకీయ వ్యవస్థగా మారాలనేది ఆమె ఆలోచన ఉంది.
బిఆర్ యస్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆమె పార్టీలోకి ఆశించిన మేరకు చేరికలు జరగలేదు. మాజీ ఎమ్మెల్యే లు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ ని వీడకుండా ఎవరికి వారే కట్టడి చేస్తూ వస్తున్నారు. ఒకరిద్దరు మాజీ లు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్తామని చెప్పనవారిని దగ్గరుండి మరీ సాగనంపారు.
ఎంపీ రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ గా పనిచేసిన కవిత జిల్లా లో రాజకీయ సమీకరణ సామాజిక వర్గాల ప్రభావం ఫై స్పష్టత ఉంది. అందుకే ఆమె వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
పార్టీఏర్పాటు తర్వాత సొంత జిల్లా నుంచి ఆదరణ కరువైందనే విమర్శలు వచ్చాయి.అందుకే పాంచజన్య సభ ను జిల్లా లో నిర్వహించారు ఇంట గెలిచాక రచ్చ గెలవాలని భావించిన ఆమె పార్టీ కి ఆయువు పట్టుగా చెప్తు పాంచజన్య సభ సకెస్స్ కోసం పరితపించారు అంచనాలకు మించి జనసమీకణ జరగడంతో టిఆర్ ఎస్ శ్రేణుల్లో కదనోత్సవం కనిపించింది.
సభ సూపర్ హిట్ తర్వాత కవిత గేర్ మార్చారు.జిల్లాలో ని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ లలో పార్టీ ని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసారు బలమైన సామాజిక వర్గం నేతలకోసం అరా తెస్తూనే ఉన్నపలంగా పార్టీ మరింత క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే నేతలను ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జ్ లకు నియమించారు.
ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన తో పాటు మహిళా రిజర్వేషన్ లు సైతం అమల్లోకి వచ్చే అవకాశం వుండడంతో అందుకు తగ్గట్టుగానే కవిత వ్యూహరచన చేస్తున్నారు ఇందులో భాగంగా మహిళా నేతలను సైతం క్షేత్ర స్థాయిలో పనిచేసేలా ఇప్పటినుంచే దిశా నిర్దేశం చేస్తున్నారు.ముఖ్యంగా యువ మహిళా లనే ఆమె తెరమీదికి తెచ్చే ఆలోచనలో ఉన్నారు.
వచ్చే ఎన్నకల్లో జెన్ జి ప్రాబల్యం ప్రభావం చూపే అవకాశం వుండడంతో ఆమె ముందస్తు గా యువ మహిళా లకు ముందుకు తెచ్చే కసరత్తులో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ బిఆర్ యస్ పార్టీలో మహిళా నేతలున్న వారు ఇప్పటి తరం లో ఇమడ లేని పరిస్థితి అందుకే యువ తరంనే ప్రయోగించాలనేది కవిత ఎత్తుగడ ఉంది .అందుకే కీలకమైన అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ గా మోహిక రెడ్డి ని నియమించారు.
కేవలం రెండు నియోజవర్గాలకే ఇంచార్జ్ లను నియమించారు మొదటి దఫా లో ఈ రెండు సెగ్మెంట్ ల మీద ఎక్కువగా ఫోకస్ చేయ బోతున్నారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన మోహిక రెడ్డి ఎంట్రీ లోనే అర్బన్ బాధ్యతలు ఇవ్వడం వ్యూహాత్మక ఎత్తుగడ గా చెప్తున్నారు రాబోయేరోజుల్లో అర్బన్ మహిళా రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆయా పార్టీల్లో టికెట్ ల కోసం ముందు వరుస ఉండే మహిళా నేతలు 50 ఏళ్లకు పై బడిన వారే ఉన్నారు లేదంటే నేతల సతీమణులే వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే జేన్ జి గా ఉన్న మోహిక రెడ్డి ని తెరమీదికి తెచ్చారు.మోహిక భర్త బొర్గం కు చిన్ను గౌడ్ కు యువత మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
సామాజిక ఆర్థిక నేపథ్యం కూడా మోహిక కు ప్లస్ అవుతాయని ముఖ్యంగా యువత లో పార్టీ ప్రాబల్యం మరింత విస్తరించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి
