ట్రాక్టర్ – బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు అక్కడికక్కడే .ఈ ఘటన శనివారం ఉదయం రాజంపేట్ మండలం క్యాసంపల్లిలో జరిగింది గ్రామానికి చెందిన సాయి (20) తన స్నేహితుడు నందు తో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై ఉన్న నందుకు తీవ్ర గాయాలయ్యాయి.
అతని వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
