HomePOLITICAL NEWSNationalఢిల్లీ లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు లఅరాచకాలు .....కేంద్ర మంత్రి బండి సంజయ్

ఢిల్లీ లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు లఅరాచకాలు …..కేంద్ర మంత్రి బండి సంజయ్

ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు శక్తులు అరాచకాలకు సృష్టించాయని మంత్రి మండిపడ్డారు. ఈ శక్తులు ఏకంగా పార్లమెంట్‌పై దాడి చేసేందుకు కుట్ర చేశాయని, అందులో భాగంగానే దేశ వ్యతిరేక నినాదాలు చేశాయని ఆరోపించారు.

పోలీసులు, జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ దాడుల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలై తలలు పగిలినా పోలీసులు సంయమనం పాటించి ఎక్కడా ఫైరింగ్ చేయలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే అరాచక శక్తులపై తప్పనిసరి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని వివరించారు.

ఢిల్లీ ఉద్రిక్తతల వెనుక విదేశీ కుట్ర ఉందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ దేశంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసిందని బండి సంజయ్ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments