హైదరాబాద్ నగరంలో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు .. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు.. ఒకేసారి బయటకు రావొద్దని.. ఒకేసారి ఉద్యోగులను వదలొద్దని ఐటి సంస్థలను పోలీసులు కోరారు .. విడతల వారీగా.. సమయం తీసుకుని ఒక్కొక్కరుగా బయటకు రావాలని ఐటీ కంపెనీలకు సూచించింది. కొంత కొంత సమయం తీసుకుని..
విడతల వారీగా పంపించే విధంగా ఎర్లీ లాగ్ అవుట్ విధానాన్ని అమలు చేయాలని ఐటీ కంపెనీలకు సూచించింది భారీ వర్షాల హెచ్చరికలతో.. ట్రాఫిక్ రద్దీ పెరిగి.. అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతుందని..
వర్షం నీరు నిలిచే ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్పష్టం చేసింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్. ఈ పరిణామాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఉద్యోగులను ముందస్తుగా ఇళ్లకు వెళ్లే విధంగా టైం షెడ్యూల్ మార్చాలని సూచిస్తూ..
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు లేఖ రాసారు . గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, నానక్ రాంగూడ ఏరియాల్లోని ఐటీ కంపెనీలు అన్నీ.. ఈ సూచనలు, సలహాలు పాటించాలని కోరింది.
