HomeTelanganaNizamabadఅభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి ... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే...

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి … మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ …

నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సోమవారం హైదరాబాదులోని సచివాలయంలో కలిసి ప్రతిపాదనలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవాడ వంతెన ( ఆర్ వో బీ) పొడిగింపు ( అదనపు పనులు) చేయాలని కోరడం జరిగిందన్నారు.

ప్రధానంగా ఈ రైల్వే లైను దాటడానికి విజయ థియేటర్ మరియు నాందేవాడ వంతెన వద్ద కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయ ని ఈ నేపథ్యంలో సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మరొక రైల్వే రన్వే ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రూ.170 కోట్లు మంజూరుకావాలన్నారు.

అలాగే నిజామాబాదులోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి పాత జిపి ఆఫీస్ వరకు రూ.30 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్డు కోసం ప్రతిపాదించడం జరిగింది. అలాగే వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీమ్గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను అందజేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments