HomeLaw and Orderఆపరేషన్ ముస్కాన్–12లో 119 మంది బాలల గుర్తింపు..నెలరోజుల ప్రత్యేక డ్రైవ్‌లో 48 కేసుల నమోదు

ఆపరేషన్ ముస్కాన్–12లో 119 మంది బాలల గుర్తింపు..నెలరోజుల ప్రత్యేక డ్రైవ్‌లో 48 కేసుల నమోదు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–12లో మొత్తం 119 మంది బాలలను గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు..ఆపరేషన్‌లో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 19, ఆర్మూర్ డివిజన్‌లో 15, బోధన్ డివిజన్‌లో 14 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

తప్పిపోయిన పిల్లల వివరాలను ట్రాక్‌చైల్డ్ పోర్టల్‌లో నమోదు చేసి వారి ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు.సబ్‌డివిజన్‌ల వారీగా నిజామాబాద్ సబ్‌డివిజన్‌లో 43 మంది, బోధన్ సబ్‌డివిజన్‌లో 49 మంది, ఆర్మూర్ సబ్‌డివిజన్‌లో 27 మంది బాలలను గుర్తించినట్లు వెల్లడించారు.

మొత్తం 119 మంది బాలలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.తల్లిదండ్రులు ఉన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నామని, తల్లిదండ్రులు లేని చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణకు తరలిస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments