HomeHEALTHఅరుదైన ఘనత సాధించిన నిమ్స్ ……వెయ్యి రోబోటిక్ శస్త్ర చికిత్సలు

అరుదైన ఘనత సాధించిన నిమ్స్ ……వెయ్యి రోబోటిక్ శస్త్ర చికిత్సలు

వైద్య సేవల్లో నిమ్స్ హాస్పిటల్‌ అరుదైన ఘనత సాదించింది 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.

సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ‌ని కలిసిన డాక్టర్ రాహుల్ దేవరాజ్, నిమ్స్ సాధించిన ఈ ఘనతను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్‌తో పాటు రొబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు.

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇటీవలే నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తవడం, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి అన్నారు.

దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు.

ఈ ఘనత సాధించినందుకు నిమ్స్​ డైరెక్టర్​ రాహుల్​ దేవరాజ్​‌తో పాటు వైద్య బృందం, ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments