HomeTelanganaHyderabadఅంకాపూర్‌కు పీహెచ్‌సీ, నందిపేట్‌కు సీహెచ్‌సీ మంజూరు..ఆర్మూర్‌కు వైద్య సేవల బలోపేతంపై మంత్రి దృష్టికి సమస్యలు

అంకాపూర్‌కు పీహెచ్‌సీ, నందిపేట్‌కు సీహెచ్‌సీ మంజూరు..ఆర్మూర్‌కు వైద్య సేవల బలోపేతంపై మంత్రి దృష్టికి సమస్యలు

రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జిల్లా వైద్య రంగంపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్, పిప్రి గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), మచ్చర్ల గ్రామానికి ఆరోగ్య ఉపకేంద్రం, నందిపేట్, మాక్లూర్ మండలాలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) మంజూరు చేయాలని సమావేశంలో కోరారు.

మంత్రి సానుకూలంగా స్పందించి అంకాపూర్ గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), నందిపేట్ మండలానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) మంజూరు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది.

ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్ పరికరాలు, నవజాత శిశువుల వార్మర్లు, క్రాష్ కార్ట్స్, వీల్‌చైర్లు, పడకలు, ఐవీ సెట్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అలాగే బయోమెడికల్ వ్యర్థాల గది, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments