HomeCRIMEభర్త, అత్తలకు విషo ఇచ్చిన మహిళా హత్యాచేయడానికి పన్నాగం ......నిందితురాలు అరెస్ట్

భర్త, అత్తలకు విషo ఇచ్చిన మహిళా హత్యాచేయడానికి పన్నాగం ……నిందితురాలు అరెస్ట్

ఫిర్యాదు ప్రకారం, నిందితురాలు శ్రీమతి పొట్టోళ్ల సోని (33), నివాసం: ముదక్‌పల్లి గ్రామం తన భర్త పొట్టోళ్ల భూమన్న @ భూమయ్య మరియు అత్త శ్రీమతి భూదేవ్వ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్త అత్తలను హత్య చెయ్యాలనే ఉద్దేశ్యం తో వారు తినే వంట లో విషం కలిపింది.

ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు ముదక్ పల్లి గ్రామానికి చెందిన సోని ఈనెల 1.న ఇంట్లో వండిన మీల్ మేకర్ కూరలో గడ్డి మందు (వీడిసైడ్) కలిపింది అత్త భూదేవ్వ ఆ కూరతో భోజనం చేయడంతో తీవ్ర వాంతులు, విరేచనాలకు గురయ్యారు.

అనంతరం భర్త భూమన్న అదే కూరను తినే సమయంలో పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే తినడం ఆపివేశారు. అయినప్పటికీ ఆయనఅనారోగ్యానికి గురయ్యారు ఇద్దరినీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కు తరలించి చికిత్స అందించారు.

సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

కేసులో నిందితురాలు శ్రీమతి పొట్టోళ్ల సోని (33), పోలీసులు అరెస్ట్ చేశారు మరియు కోర్ట్ నందు హాజరు పరిచినము అని మొగ్పాల్ SI సుష్మిత తెలిపారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments