HomeTelanganaNizamabadజిల్లాలో ప్రభుత్వ వైద్య సేవల ఫై మంత్రి సుదీర్ఘ సమీక్షా ......హాజరు అయిన ఎమ్మెల్యే లు

జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవల ఫై మంత్రి సుదీర్ఘ సమీక్షా ……హాజరు అయిన ఎమ్మెల్యే లు

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజానర్సింహా గారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల మెరుగుదల, వైద్య సేవల విస్తరణ, అవసరమైన సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపాతిరెడ్డి గారు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments