పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సాయంతో 16 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్‌హెచ్‌వో కె. బ్రహ్మ మురారి అప్పగించారు. ఈ సందర్భంగా తమ విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ చాదర్‌ఘాట్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఈఐఆర్ పోర్టల్‌ను సమర్థంగా వినియోగించి మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, క్రైమ్ టీంను మలక్‌పేట్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి అభినందించారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్‌హెచ్‌వో కె. బ్రహ్మ మురారి సమక్షంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.
