హైడ్రా లో కొలువుల కోసం నిరుద్యోగులు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్దకు పోటెత్తారు శనివారం తెల్లవారుజాము నుంచే యువకులు వేలాది గా తరలివచ్చారు. వచ్చిన వారిని అదుపు చెయ్యడానికి పోలీసులు చమటోడ్చారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, డ్రైవర్ల పోస్టుల భర్తీకి సంబంధించి హైడ్రా (HYDRAA) నోటిఫికేషన్ విడుదల చేసింది ,ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్ పోస్టులు ఉండగా, మిగిలిన 50 హెవీ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. విద్యా అర్హతల విషయానికొస్తే పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.
డ్రైవర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.కానీ ఉన్నత చదువులు చదివి వారు సైతం వేలాది గా తరలి వచ్చారు
