HomeCRIMEరైల్వేస్టేషన్‌ వద్ద బైక్‌ చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడు..

రైల్వేస్టేషన్‌ వద్ద బైక్‌ చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడు..

భార్యను పికప్‌ చేసుకునేందుకు ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని రైల్వేస్టేషన్‌ వద్ద నిలిపి లోపలికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నిందితుడు బైక్‌ను అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు,సమాచారం అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న “ఇది సంగతి రిపోర్టర్” పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద అతడిని అతనిని ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడే స్థానిక ఒకటవ టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణలో నిందితుడు మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

అతడు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిన పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. బైక్‌ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి గత నేర చరిత్రతో పాటు మరిన్ని చోరీ ఘటనల్లో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments